అనుష్క నిశ్శబ్దం ఫస్ట్ లుక్…

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక  అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం‘. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. నిశ్శబ్దం సినిమాను మంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరు ‘సాక్షి‘. ఇదే విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ నిశ్శబ్దం సినిమా పోస్టర్‌పై “సాక్షి, ఏ మ్యూట్‌ ఆర్టిస్ట్‌” అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. షాలిని పాండే, అంజలి, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాలీవుడ్‌ స్టార్‌ మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ ముఖ్య పాత్రలో కనిపిం​చనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Videos