ఆందోళనకు గురికావొద్దు :జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌

అమర్‌నాథ్‌ యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారన్న నిఘా వర్గాల సూచనలతో యాత్రికులను వెనక్కి రావాలని హెచ్చరించిన విషయమై కశ్మీర్‌ ప్రజలు ఆందోళనకు గురికావొద్దని జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ పిలుపునిచ్చారు. బలగాల మోహరింపుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్న దృష్ట్యా భద్రతా చర్యల కోసమే భారీగా కేంద్ర బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. రాజకీయ నాయకులు సంయమనంతో ఉండాలని సూచించారు.

ఇప్పటికే కశ్మీర్‌కు సుమారు 35వేల మంది కేంద్ర బలగాలు చేరుకున్నాయి. పూంఛ్‌ రజౌరీలో బలగాలను ముమ్మరం చేశారు. కశ్మీర్‌కు బలగాల రాకతో స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. పెట్రోల్‌, నిత్యావసర వస్తువులను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు, కశ్మీర్‌లోని కిష్ట్వార్‌ జిల్లాలో మచేల్‌మాతా యాత్రను సైతం అధికారులు రద్దు చేశారు. భద్రతా కారణాలతో ఈ యాత్రను రద్దుచేసినట్టు అధికారులు వెల్లడించారు.

Videos

One thought on “ఆందోళనకు గురికావొద్దు :జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌

  • December 12, 2019 at 8:39 am
    Permalink

    I have been reading out a few of your stories and it’s pretty nice stuff. I will make sure to bookmark your blog.

Leave a Reply

Your email address will not be published.