ఆశ్చర్యపరుస్తున్న ధావన్

టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ లో మరో కొత్త కోణం వెలుగు చూసింది. తన వేణుగానంతో అభిమానులను అశ్యర్యంలో ముంచెత్తుతున్నాడు ధావన్. కేరళలో.. సముద్ర తీరాన ధావన్‌ తన్మయత్వంతో వేణు గానం చేశాడు. గురువు వేణుగోపాల స్వామి వద్ద గత మూడేళ్లుగా ఫ్లూట్‌ వాయించడం నేర్చుకుంటున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ‘సరికొత్త ఆరంభం. చెట్లు, స్వచ్ఛమైన గాలి, చెంతనే సముద్రం. కాస్త సంగీతం. మరికాస్త ఆనందం’ అని పేర్కొన్నాడు. ఇక గబ్బర్‌ వేణుగానంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘నిజంగా మీరేనా’ అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. వెస్టిండీస్‌ పర్యటనలో టీ20, వన్డే సిరిస్‌లలో పేలవ ప్రదర్శన కారణంగా ధావన్‌ టెస్టు సిరీస్‌కు ఎంపికవని సంగతి తెలిసిందే. గాయంతో ప్రపంచకప్‌నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన అనంతరం ధావన్‌ విండీస్‌ గడ్డపై ఐదు మ్యాచ్‌లు ఆడాడు. 2 వన్డేలలో కలిపి 38 పరుగులు, 3 టి20 మ్యాచ్‌లలో కలిపి అతను 27 పరుగులే చేశాడు.

Videos