ఎవరు ముందు అందుకుంటారు

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ పొట్టి క్రికెట్‌లో ఓ ప్రపంచ రికార్డుపై కన్నేశారు. టీ20 క్రికెట్‌లో అత్యధిక అర్ధ శతకాలు సాధించిన క్రికెటర్లలో ఇద్దరూ (20) సమానంగా కొనసాగుతున్నారు. రోహిత్ 86 ఇన్నింగ్స్‌లో 20 అర్ధశతకాలు నమోదు చేస్తే కోహ్లీ 62 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో శనివారం రాత్రి జరగబోయే మ్యాచ్‌లో ఎవరు రాణిస్తారో వేచిచూడాలి. వీరిద్దరి తర్వాత న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌(16), వెస్టిండీస్‌ ఓపెనర్‌ క్రిస్‌గేల్‌(15), న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(15), శ్రీలంక బ్యాట్స్‌మన్‌ తిలకరత్నే దిల్షాన్‌(14) వరుసగా ఉన్నారు. భారత్‌ తరఫున శిఖర్‌ ధావన్‌(9) అర్ధశతకాలతో కొనసాగుతున్నాడు.

నేటి నుంచి టీమిండియా వెస్టిండీస్‌తో నెల రోజులపాటు తలపడనుంది. శనివారం, ఆదివారం రెండు టీ20 మ్యాచ్‌లు ఫ్లోరిడాలోని సెంట్రల్‌ బ్రోవార్డ్‌ రీజనల్‌ పార్క్‌ స్టేడియంలో ఆడనుంది. ఈనెల 6న వెస్టిండీస్‌లో మూడో టీ20లో తలపడనుంది. ఆపై మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు అక్కడే ఆడనుంది.

 

Videos

Leave a Reply

Your email address will not be published.