ఏపీలో ఉప ఎన్నికలు

ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్ దాఖలుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 14ను తుది గడువుగా ఈసీ నిర్ణయింది. 16వ తేదీన నామినేషన్ల పరిశీలన, 19న ఉపసంహరణకు తుది గడువుగా పేర్కొంది. ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.