ఏపీ రాజధాని తిరుపతికి మార్చండి

ఏపీ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని మాజీ ఎంపీ చింతా మోహన్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు. రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మారనుందని.. దీనిపై కేంద్రంలోని పెద్దల నుంచి తనకు సమాచారముందని చెప్పారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. దొనకొండ విషయంలో తొందరపడొద్దని సీఎం జగన్‌కు ఆయన సూచించారు. అక్కడ జలవనరులు, రైల్వే, రవాణా సౌకర్యాలు లేవని చెప్పారు. తిరుపతి కాకుండా రాజధానిగా ఇంకా ఏ ప్రాంతమైనా నిలబడదన్నారు. అయితే ఈ విషయమై కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు.

Videos

28 thoughts on “ఏపీ రాజధాని తిరుపతికి మార్చండి

Leave a Reply

Your email address will not be published.