కూలిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట పైకప్పు
మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని ఓ భవనంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్న అంతస్తు పైకప్పు బుధవారం కుప్పకూలడంతో పదుల సంఖ్యలో వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.దీనితో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. దాదాపు 20 మంది వరకూ శిథిలాల ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరో 10 మంది వరకూ రక్షించినట్లు వెల్లడించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇటీవలి కాలంలో మహారాష్ట్రలో భవనం కూలిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత జులై 17న ముంబయిలో ఓ పాత నాలుగంతస్తుల భవంతి కూలిన ఘటనలో 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.