గోదావరి బోటు ప్రమాదం: 12 మృతదేహాలు వెలికితీత

ఆదివారం రోజున గోదావరి నదిలో బోటు మునిగి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఇక ఇప్పటికే రెండు హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. లోతు ఎక్కువగా ఉన్నందున గల్లంతైన వారికోసం వెతికేందుకు సోనార్ స్కానర్లను వినియోగిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఏపీ మంత్రులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎంతో పాటు రాష్ట్ర హోంమంత్రి సుచరిత కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలు వెలికితీసినట్లు సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు సహాయక చర్యలను స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తున్నారు. వెంటనే బోటు అనుమతులు సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా విపత్తు నిర్వహణల శాఖ ఎప్పటి కప్పుడు ఘటనా స్థలిలో జరుగుతన్న చర్యల గురించి ముఖ్యమంత్రికి నివేదిస్తున్నారు.

Videos