తిరుపతికి రాజధానా…మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజధానిపై గందరగోళం కొనసాగుతోంది. రాజధానిని తరలిస్తారనే ప్రచారంపై ఆందోళన వ్యక్తమవుతుండగానే.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింత మోహన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆయనకు రహస్య సమాచారం కూడా ఉందని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఏపీకి తిరుపతి రాజధాని కాబోతోందని మరో బాంబ్ పేల్చారు చింతా మోహన్. ముఖ్యమంత్రి జగన్ అమరావతిని వదిలి తిరుపతికి రావాలని.. రాజధానిగా తిరుపతికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని దొనకొండకు మార్చడం ఖాయమని అన్నారు. రాజధాని మార్పుపై కేంద్రంతో జగన్ చర్చించారని.. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో తొందరపాటు పనికిరాదని.. దొనకొండ ప్రాంతం సరైంది కాదన్నారు.

Videos