దేశం మీకు అండగా ఉంది:జగన్

భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. విక్రమ్ లండర్ నుండి సంకేతాలు ఆగిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. దీనితో పలువురు ప్రముఖులు వీరికి అండగా నిలుస్తున్నారు. దేశం మొత్తం మీకు అండగా ఉందని భరోసా ఇస్తున్నారు.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ‘మన శాస్త్రవేత్తలను చూసి దేశం మొత్తం గర్విస్తుంది. ఈ సమయంలో ఇస్రో కి దేశం అండగా ఉంది. వారి ప్రయత్నాలకు అభినందనలు’ అన్నారు. తెదేపా నేత చంద్రబాబు కూడా స్పందించారు. ‘చంద్రయాన్-2 ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి దేశం గర్విస్తుంది. ఆకరు నిమిషంలో అవరోధం ఎదురయినప్పటికి ఇప్పటి వరకు సాధించింది తక్కువ కాదు. త్వరలోనే మన అనుకున్నది సాధిస్తాం’ అన్నారు.

Videos