నవయుగ సంస్థకు నోటీసులు

ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులపై సిఫార్సుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు పోలవరం నిర్మాణ పనుల నుంచి తప్పుకోవాలంటూ నవయుగ సంస్థకు ఏపీ జలవనరుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఈపీసీ టెండరు ప్రక్రియలోని క్లాజ్‌ 89 (3) ప్రకారం పోలవరం ప్రాజెక్టులోని హెడ్‌వర్క్స్‌ పనులు, క్రస్ట్‌ లెవెల్‌ వరకు స్పిల్‌ వే నిర్మాణం, ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌, జలవిద్యుత్‌ కేంద్రం ఫౌండేషన్‌తో పాటు అప్రోచ్‌ ఛానల్‌ తదితర పనుల నుంచి తప్పుకోవాలంటూ ప్రీక్లోజర్‌ నోటీసులు జారీ చేసింది. 60 (సి) నిబంధన ప్రకారం పాత కాంట్రాక్టర్‌ను తప్పిస్తూ నామినేషన్‌ ప్రాతిపదికన పనులు కేటాయించడంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినందున ప్రీక్లోజర్‌ నోటీసులు జారీ చేసినట్లు జలవనరుల శాఖ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌బాబు పేరిట నవయుగ సంస్థకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.

 

Videos

Leave a Reply

Your email address will not be published.