పట్టిసీమ, చింతలపూడి పనులు ఆపండి:ఎన్జిటి

ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ అనుమతుల్లేని ఎత్తిపోతల పథకాలను ఆపాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను నిలిపివేయాలని కోరింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఆయా పథకాలను నడపాలని ఆదేశించింది. గోదావరి, పెన్నా నదులపై ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై గతంలోనే విచారణ చేపట్టిన ఎన్జీటీ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీ పీసీబీ)  కేంద్ర పర్యావరణ శాఖలపై మండిపడింది. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే ఆయా ప్రాజెక్టులను తిరిగి కొనసాగించాలని స్పష్టం చేసింది.

 

Videos

Leave a Reply

Your email address will not be published.