పవన్ కళ్యాణ్ అమరావతిలో ఏం ప్లాన్ చేస్తున్నారు..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ కొత్త రాజధాని అమరావతిలో సరికొత్త ప్లాన్ వేస్తున్నారని సమాచారం. రాబోయే తన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకను అమరావతిలో జరపాలని చూస్తున్నారట. సినిమా వేడుకల గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకోని పవన్ ఈసారి ప్రత్యేకంగా అమరావతిలోనే ఆడియో విడుదలను జరపాలని అనుకోవడం విశేషమే మరి. ఎందుకంటే పవన్ ప్రస్తుతం ఓ పొలిటీషియన్. ఒక పొలిటీషియన్ ప్రజలతో లింకైన ఏ కార్యక్రమం చేసినా దాని వెనుక అనేక కారణాలుంటాయి.

అలాగే పవన్ ప్లాన్ వెనుక కూడా కొత్త రాజధానిని హైలైట్ చెయ్యాలనో.. లేకపోతే రాజకీయంగా నిలదొక్కుకోవాలనో.. లేకపోతే స్వయంగా తానే సినిమాని నిర్మిస్తున్నారు కాబట్టి ప్రత్యేక శ్రద్ద తీసుకుని సినిమాని జనాల్లోకి తీసుకువెళ్ళాలనో ఆలోచన ఉండవచ్చు. మొత్తానికి ఏదేమైనా వస్తున్న సమాచారం ప్రకారం పవన్ గనక అమరావతిలో ఆడియో వేడుక నిర్వహిస్తే ఆయనకు అటు సినిమా పరంగా.. ఇటు రాజకీయంగా కాస్త ప్రయోజనం ఉండక మానదు.

pawan-kalytan-new-plan-in-amaravati
pawan-kalytan-new-plan-in-amaravati
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *