ప్రకాశం బ్యారేజ్…70 గేట్లు ఎత్తివేత

భారీ వర్షాలతో కృష్ణ నది ఉగ్ర రూపం దాల్చింది. నాగార్జున సాగర్ నుండి పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో 17గేట్లను ఎత్తి నీటిని దిగువనా గల ప్రకాశం బ్యారేజికి వదిలారు. దీనితో ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పైకెత్తారు. బ్యారేజీలో ప్రస్తుతం 10 అడుగుల నీటి మట్టం ఉంది. మొదట నీటిమట్టం 12 అడుగులకు చేరితే గేట్లు తెరవలని అనుకున్నప్పటికి పులిచింతల నుండి వరద ప్రవాహం ఎల్లువగ ఉండడంతో ముందుగానే గేట్లు ఎత్తారు. దీనితో దిగువ ఉన్న గ్రామాలను అప్రమత్తం చేశారు.

Videos

5 thoughts on “ప్రకాశం బ్యారేజ్…70 గేట్లు ఎత్తివేత

Leave a Reply

Your email address will not be published.