ప్రాణాలు తీసిన ఓటమీ…
మేరీల్యాండ్‌లో శుక్రవారం జరిగిన 140-పౌండ్ల అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రపంచ టైటిల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రష్యన్ బాక్సర్ మాగ్జిమ్ దాదాషేవ్ మరణించడు. ప్రత్యర్థి సుబ్రియేల్ మాటియాస్ వరుస పంచ్‌ల ధాటికి మాగ్జిమ్ కుప్పకూలిపోయాడు. దీంతో అతని ట్రైనర్ మాగ్జిమ్ ఓటమిని తెలియజేశాడు. గాయాల తీవ్రత అధికంగా ఉండటంతో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న మాగ్జిమ్ ఈ రోజు మరణించాడని అతని భార్య ఎలిజవేటా తెలిపారు. చికిత్స పొందుతున్న మాగ్జిమ్ ఈ రోజు మరణించాడని అతని భార్య ఎలిజవేటా తెలిపారు. 8 ఏళ్ల మాగ్జిమ్ బరిలోకి దిగిన 14 మ్యాచుల్లో 13 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన తన ఆఖరి మ్యాచ్‌లో మాత్రమే ఓటమిపాలయ్యాడు.