బిగ్ బాస్ లో స్విమ్మింగ్ ఫుల్ ఫైట్

బిగ్ బాస్-3 46వ ఎపిసోడ్ లో నిన్న ఎపిసోడ్ లో మొదలయిన దొంగలు దోచిన నగరం టాస్క్ లో రెండవ భాగంతో మొదలయ్యింది. టిమ్ మేట్స్ అందరూ దొంగ దొంగ వచ్చారే అనే పాటకు డాన్స్ వేశారు. రెండు గ్రూప్ లుగా డివైడ్ అయిన హౌస్ మేట్స్ రెండవ భాగంలో అందరూ చాలా జాగ్రత్తగా ఆడారు. కానీ ఈ రెండవ రౌండ్ లో బలప్రయోగం ఇంకా ఎక్కువ అయ్యింది. అందరూ ఒకరి మీద ఒకరు మీదపడి మరి కొట్టుకున్నారు. రాహుల్ ,రవి, అలీలు అయితే ఎలా పోట్లాడరో వాళ్ళకే తెలీదు. తరువాత అందరూ ఒకరి ఒకరు స్విమ్మింగ్ పూల్ లోకి దుకారు. అందులో కూడా ఒకరి మీద ఒకరు బాల ప్రయోగం చేశారు. కొంచెం సేపటి తరువాత బిగ్ బాస్ ఆ టాస్క్ ని ఆపేయమనడంతో అందరూ అగారు. టాస్క్ పూర్తి అయిన తరువాత బిగ్ బాస్ అందరినీ డిస్టర్బ్ చేసిన ఇద్దరు కంటెస్టెంట్స్ ని పేర్లు చెప్పమన్నారు. దీనితో హౌస్ మేట్స్ రాహుల్, రవికృష్ణల పేర్లు చెప్పారు. దీంతో వారికి బిగ్ బస్ జైలు శిక్ష విధించారు.

Videos