బిగ్ బాస్-3 లో ఎమోషనల్ అయిన శ్రీముఖి, శివ జ్యోతి

బిగ్ బస్-3 62వ ఎపిసోడ్ లో మొత్తం ఎమోషనల్ గా నడిచింది. గత రెండు సీజన్లలో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ను తమ ఇంటి సభ్యులు వచ్చి కలవడం ఆనవాయితీ. అయితే ఈసారి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్స్ తరుపున 10 మంది ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్‌కి వచ్చారు. అయితే ఈ పది మందిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ను కలిసే అవకాశాన్ని ఇద్దరి మాత్రమే ఇచ్చారు బిగ్ బాస్. మొదట పది మందిలో ఐదుగుర్ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. వితిక, శివజ్యోతి, రవి, పునర్నవి, హిమజ కుటుంబ సభ్యులు తొలి రౌండ్‌లో క్వాలిఫై కాగా.. ఈ ఐదురురిలో బిగ్ బాస్ హౌస్‌ లోకి వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అవకాశం లభించింది.

వితికా తరుపున అతని అన్నయ్యకు తొలి అవకాశం లభించగా.. రవి మావయ్యకు రెండో అవకాశం లభించింది. అనంతరం బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన ఈ ఇద్దరూ సీక్రెట్‌ రూంలో వితికా, రవిలను కలిసి బయట పరిస్థితులు, గేమ్ ఎలా ఆడుతున్నారు? ఎలా ఆడాలి అన్నదానిపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా రవి, వితికా బాగా ఎమోషన్ అయ్యారు.
మొదట 10 మందిలో ఐదుగురికి మాత్రమే బిగ్ బాస్ ఇంటి సభ్యుల్ని కలిసే అవకాశం ఇవ్వడంతో శ్రీముఖి తమ్ముడు తొలి అవకాశాన్ని కోల్పోయాడు. తనను కలుసుకోకుండానే తమ్ముడు వెనుదిరగడంతో భావోద్వేగానికి లోనైంది శ్రీముఖి. బిగ్ బాస్ ప్లీజ్.. ఒక్కసారి చూసే ఛాన్స్ ఇవ్వండి కనీసం చూస్తా.. మాట్లాడను అంటూ శ్రీముఖి గుక్కపెట్టి ఏడ్చిన తీరు ఇంటి సభ్యులతో ఆడియన్స్‌ ను కూడా భావోద్వేగానికి గురిచేసింది. ఇక శివజ్యోతి కూడా తన అన్నను కలుసుకునే అవకాశం మిస్ అవ్వడంతో బాగా ఏమోషన్ అయ్యింది. తన కోసం దుబాయ్ నుండి వచ్చిన అన్న కలవకుండానే ఇంటి నుండి వెళ్లిపోవడం పట్ల భావోద్వేగానికి లోనైంది శివజ్యోతి.

Videos