మోదీ అమెరికా హౌస్టన్ సభకు అనుకోని అతిథి

భారత ప్రధాని​  వచ్చేవారం అమెరికా పర్యటనలో భాగంగా హూస్టన్‌ నగరంలో ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. హూస్టన్‌లోని స్వచ్ఛంద సంస్థ టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) ‘హౌడీ, మోదీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 22న ఎన్ఆర్‌జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. హూస్టన్‌ నగరాన్ని ఇప్పటికే మోదీ మేనియా కమ్మేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు  ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వస్తున్నట్టు తెలిసింది. అక్కడి మీడియా కథనాల ప్రకారం ఈ కార్యక్రమానికి ట్రంప్‌తో సహా 60 మంది అమెరికా చట్టసభ సభ్యులు కూడా హజరుకానున్నట్లు వైట్ హౌస్ నుండి ప్రకటన వెలువడింది. ఒకే ప్రదేశంలో ఇంత భారీ ఎత్తున భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ఓ అమెరికా అధ్యక్షుడు ప్రసంగించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఈ వేదిక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు శ్వేత సౌధం మీడియా పేర్కొంది.మోడి, ట్రంప్ ఒకే వేదిక పంచుకోవడం ఒక చరితాత్మక అంశం అని అమెరికాలోని భారత రాయబారి హర్ష వర్ధన్ ష్రిమ్ గ్లా అన్నారు.

Videos