రివ్యూ: డియర్ కామ్రేడ్

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్లపై నిర్మించారు. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమాను నిర్మించారు.

కథ: విప్లవ భావాలున్న ఓ వ్యక్తి ప్రేమలో పడటం. ఆ తరువాత తన భావాలకు, ప్రేమకు మధ్య జరిగే సంఘర్షణ, వాటి వల్ల ఎదురైన పరిస్థితుల, మహిళా క్రికెట్ అసోషియేషన్‌లో వేదింపుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా డియర్‌ కామ్రేడ్‌. చైతన్య అలియాస్ బాబీ (విజయ్‌ దేవరకొండ) విప్లవ భావాలున్న కాలేజీ స్టూడెంట్‌. కాకినాడలోని కాలేజ్‌లో చదువుకునే బాబీ తన కోపం కారణంగా చాలా మందితో గొడవలు పడతాడు. అపర్ణా దేవీ అలియాస్‌ లిల్లీ (రష్మిక మండన్నా)స్టేట్‌ లెవల్‌ క్రికెట్ ప్లేయర్‌. తన కజిన్‌ పెళ్లి కోసం కాకినాడ వచ్చిన లిల్లీ, బాబీతో ప్రేమలో పడుతుంది. కానీ అతని కోపం, గొడవల కారణంగా వారిద్దరూ దూరమవుతారు. లిల్లీ దూరం అవ్వటంతో బాబీ పిచ్చివాడైపోతాడు. మూడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ట్రావెల్ చేస్తూ ఉంటాడు.

నెమ్మదిగా ఆ బాధను మరిచిపోయిన బాబీ ఓ ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్‌ వస్తాడు. అక్కడ లిల్లీని కలుస్తాడు. తను మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుందని తెలుసుకొని ఆమె కోలుకునేలా చేస్తాడు. అదే సమయంలో లిల్లీ ఆరోగ్యం పాడవ్వడానికి, క్రికెట్కు దూరమవ్వటానికి క్రికెట్ అసోసియేషన్‌ చైర్మన్ వేదింపులే కారణమని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి బాబీ ఏం చేశాడు..? లిల్లీ తిరిగి క్రికెటర్‌ అయ్యిందా? లేదా? అన్నదే మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్:  హీరో హీరోయిన్, సంగీతం

నెగెటివ్ పాయింట్స్: స్లో నేరేషన్, సినిమా నిడివి

 

టైటిల్: డియర్‌ కామ్రేడ్‌

రేటింగ్: 3.5/5

తారాగణం: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, శృతి రామచంద్రన్‌, సుహాస్‌

సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్‌

దర్శకత్వం: భరత్ కమ్మ

సంగీతం: జస్టిన్ ప్రభాకరన్

నిర్మాత: యష్‌ రంగినేని,న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి

Videos

One thought on “రివ్యూ: డియర్ కామ్రేడ్

  • December 12, 2019 at 2:10 pm
    Permalink

    I’m not that much of a online reader to be honest but your sites really nice, keep it up! I’ll go ahead and bookmark your website to come back in the future. Cheers

Leave a Reply

Your email address will not be published.