వరుణ్, పూజాహెగ్డే ల…వెల్లువచ్చి గోదారమ్మ

టాలీవుడ్ యువ కథానాయకుడు, మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన సినిమా వాల్మీకి. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయక. ఇటీవల విడుదల అయిన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 20నా విడుదల కాబోతున్న ఈ చిత్రం సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు ట్రెండీగ్ లో ఉంది. వివరాల్లోకి వెళ్తే శోభన్ బాబు, శ్రీదేవి నటించిన అలనాటి సినిమా ‘దేవత’ సినిమాలోని హిట్ సాంగ్ ‘వెల్లువచ్చి గోదారమ్మ’ ను ఈ సినిమాలో రీమేక్ చేస్తున్నారు. ఆదివారం జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సాంగ్ మేకింగ్ వీడియో ని విడుదల చేశారు. యానాంలో సముద్రతీరాన వెయ్యి బిందెలతో కలర్ ఫుల్ గా ఈ సాంగ్ చిత్రికరించినట్లు హరీష్ తెలిపారు. వాల్మీకి చిత్రంలో హైలైట్ గా నిలిచే అంశాలలో ఇది కూడా ఒకటి.

ముకుంద సినిమా తర్వాత వరుణ్ తేజ్, పూజా హెగ్డే కలసి నటిస్తున్న చిత్రం వాల్మీకి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంత, గోపి అచంత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

Videos