శ్రద్ధా కపూర్ సాహో రెమునిరేషన్ ఎంత

దేశవ్యాప్తంగా ప్రభాస్ నటించిన సాహో ఫీవర్ మొదలైంది. బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను  రూ. 300  కోట్లకుపైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నటీనటులకు భారీ పారితోషికం ముట్టజెపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో షేర్‌ రూపంలో ప్రభాస్‌కు రూ. 100  కోట్లకు పైగా పారితోషికం అందనుందన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు హీరోయిన్‌ శ్రద్ధ కపూర్ కు కూడా భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు గానూ శ్రద్ధా రూ. 7  కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ సినిమాలకు కూడా రెండు మూడు కోట్ల రెమ్యూనరేషన్‌ మాత్రమే అందుకునే శ్రద్ధాకు సాహో టీం భారీ ఆఫర్‌ ఇచ్చి హీరోయిన్‌గా తీసుకున్నారట.

ఈ సినిమా సక్సెస్‌ అయితే బాలీవుడ్‌లో కూడా తన క్రేజ్‌ డబుల్‌ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు శ్రద్ధా. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, మందిరా బేడీలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

 

Videos

22 thoughts on “శ్రద్ధా కపూర్ సాహో రెమునిరేషన్ ఎంత

Leave a Reply

Your email address will not be published.