సచిన్ చేసిన ఈ ఒక్క రికార్డ్ కోహ్లీ బ్రేక్ చేయలేడు

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి ‘రికార్డుల రారాజు’గా పేరుంది. ప్రపంచ క్రికెటర్ల పేరుమీదున్న ఎన్నో రికార్డులను కోహ్లీ అలవోకగా ఛేదించేశాడు. మరెన్నో సరికొత్త రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు. ఇక లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ పేరిట ఉన్న ఎన్నో మైలురాళ్లను దాటేస్తున్నాడు. కానీ సచిన్‌ చేసిన ఆ ఒక్క రికార్డును మాత్రం కోహ్లీ చేరుకోలేడట. దీనిపై సెహ్వాగ్‌ మాట్లాడుతూ..‘కోహ్లీ బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌. అతడు సెంచరీలు చేసే విధానం, పరుగులు రాబట్టే తీరు అతడిని ఉన్నత స్థానంలో ఉంచింది. అతడు సచిన్‌ పేరిట ఉన్న రికార్డులన్నీ దాదాపుగా బ్రేక్‌ చేస్తాడు. కానీ సచిన్‌ పేరిట ఉన్న ఒక్క రికార్డును మాత్రం కోహ్లీతో సహా ఎవరూ బ్రేక్‌ చేయలేరు. సచిన్‌ ఆడిన 200 టెస్టుల రికార్డును ఛేదించడం దాదాపుగా అసాధ్యమేమో. కానీ కోహ్లీ ఇప్పటివరకు 77 టెస్టులు మాత్రమే ఆడాడు’ అని అన్నాడు.

Videos