సైరా కు బాలీవుడ్ ఖాన్ల ప్రశంసలు

చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్‌ లో విశేష స్పందన లభించింది. అన్ని భాషల్లో కలిపి ఈ మూవీ ట్రైలర్ 24 గంటల వ్యవధిలో 34 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించడం విశేషం. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందుతున్న ‘సైరా’లో చిరంజీవి నటవిశ్వరూపానికి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

ఇప్పటికే చాలామంది టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ‘సైరా’ ట్రైలర్‌ను ప్రశంసించగా.. తాజాగా ఈ లిస్ట్‌ లోకి బాలీవుడ్ ఖాన్ల ద్వయం కూడా చేరిపోయారు. ట్విట్టర్ వేదికగా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లు చిరు, చరణ్‌లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇది సినిమాను హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos