3 వేల కొత్త ఉద్యోగాలు ప్రకటించనున్న గూగుల్

గూగుల్ మరో 3 వేల మందిని విధుల్లోకి తీసుకోనుంది. సెంట్రల్ లండన్ లోని తన క్యాంపస్ ను విస్తరించేందుకు గూగుల్ నిర్ణయించింది. ఈ సందర్భంగా కొత్తగా మూడు వేల మందిని విధుల్లోకి తీసుకోనుంది. కింగ్స్ కింగ్స్ క్రాస్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన కొత్త కార్యాలయంలో పనిచేసేందుకు భారీ ఎత్తున ఉద్యోగులను తీసుకోనున్నట్టు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. యూకేలో కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించిన వారికి ఉజ్వలమైన భవిష్యత్తు స్వాగతం పలుకుతుందన్నారు. అయితే 2018లో ఇది ప్రారంభమవుతుందని, ఆ నాటికి లండన్ లో ఉద్యోగుల సంఖ్య 7 వేలకు చేరుందని చెప్పారు. అమెరికా వెలుపల గూగుల్ నిర్మిస్తున్న కంపెనీ సొంత బిల్డింగ్ లలో ఇదే మొదటిది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *