కారు రిజిస్ట్రేషన్ నంబర్ కోసం 33 కోట్లు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో(యూఏఈ) ఓ వ్యక్తి కార్ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం 49 లక్షల డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.33 కోట్లు ) ఖర్చు చేశాడు. గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం.. యూఏఈలోని సంపన్న ఎమిరేట్స్‌లలో మూడో స్థానంలో ఉన్న షార్జాలో ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయగా, ఆరిఫ్ అహ్మద్ అల్-జరౌనీ అనే వ్యాపారవేత్త నలభై తొమ్మిది లక్షల డాలర్లుకు బిడ్ వేసి నం.1 నంబర్‌ను దక్కించుకున్నాడు. ఈ మొత్తం రిజర్వ్ ధర కంటే 18 రెట్లు అధికం. అయితే అక్కడి నంబర్ ప్లేట్ల వేలంలో ఇదే ఆల్‌టైం రికార్డు కాదు. 2008లో జరిగిన బిడ్డింగ్‌లో యూఏఈలోని అత్యంత సంపన్న ఎమిరేట్ అయిన అబుదాబీలో నం.1 నంబర్ ప్లేట్‌ను ఓ వ్యక్తి 1.42 కోట్ల డాలర్లకు దక్కించుకున్నాడట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *