ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతలు వీరే..!

భారతీయ సినీ పరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత ఆ స్థాయి పేరున్నది ఫిల్మ్‌ఫేర్ అవార్డులకే! హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషా సినిమాలకు విడివిడిగా ప్రకటించే ఈ అవార్డుల్లో సౌతిండియన్ సినిమాలు మొత్తానికి సంబంధించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగింది. సౌతిండియన్ సినిమాలోని నాలుగు సినీ పరిశ్రమల నుంచి తారలంతా దిగిరాగా అంగరంగ వైభవంగా ఈ అవార్డు ప్రదానోత్సవ వేడుక జరిగింది.

సినీ తారల ఆట పాటల మధ్య సాగిన ఈ వేడుకలో తెలుగు సినిమాకు సంబంధించి గత సంవత్సవరం విడుదలై దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇక అదేవిధంగా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సినిమాటోగ్రఫీ లాంటి ఇతర విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకొని ‘బాహుబలి’ ఈ అవార్డుల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక సూపర్ స్టార్ మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ సంగీత దర్శకత్వం విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.

పూర్తి అవార్డుల వివరాలిలా ఉన్నాయి.

ఉత్తమ చిత్రం : బాహుబలి
ఉత్తమ నటుడు : మహేష్ బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ నటి : అనుష్క (రుద్రమదేవి)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)
ఉత్తమ సహాయ నటుడు : అల్లు అర్జున్ (రుద్రమదేవి)
ఉత్తమ సహాయ నటి : రమ్య కృష్ణ (బాహుబలి)
ఉత్తమ గీత రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి (‘రా ముందడుగేద్దాం’.. కంచె)
ఉత్తమ నేపథ్య గానం (మేల్) : ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్ (‘పోరా శ్రీమంతుడా’.. శ్రీమంతుడు)
ఉత్తమ నేపథ్య గానం (ఫీమేల్) : గీతా మాధురి (‘జీవ నది’.. బాహుబలి)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : కె.కె. సెంథిల్ కుమార్ (బాహుబలి)
ఉత్తమ కొరియోగ్రఫీ : శేఖర్ (‘కుంగ్ ఫూ కుమారి’.. బ్రూస్‌లీ)
ఉత్తమ నటుడు (జ్యూరీ) : నాని (భలే భలే మగాడివోయ్)
ఉత్తమ నటి (జ్యూరీ) : నిత్యా మీనన్ (మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు)
ఉత్తమ నూతన నటుడు : అఖిల్ (అఖిల్)
ఉత్తమ నూతన నటి : ప్రగ్యా జైస్వాల్ (కంచె)
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు : మోహన్ బాబు

Videos

Leave a Reply

Your email address will not be published.