9నెలల జీతంతో ఇంటికి పంపిస్తున్న కాగ్నిజెంట్

కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగులపై వేటు  వేయనుంది.  గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భారీ సంఖ్యలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని ప్రయత్నిస్తున్న కాగ్నిజెంట్‌ తాజాగా మరో ఈ చర్యకు శ్రీకారం చుట్టింది. నష్టపరిహార చెల్లింపుతో కూడిన  వాలెంటరీ సెపరేషన్‌  పథకాన్ని  ప్రవేశపెట్టింది.  కంపెనీ డిజిటల్ టెక్నాలజీ వైపు వేగంగా కదులుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.  ముఖ్యంగా టాప్‌ లెవల్‌ ఉద్యోగులను వదిలించుకునేందుకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని అమలు చేస్తోంది.   అంతేకాదు  రెండవ త్రైమాసిక చివరి నాటికి ఈ ప్రక్రియ ముగించాలని ఆశిస్తోంది.

నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ ఈ వార్తలను  ధృవీకరించింది.  డిజిటల్‌ మార్పులు,  అధిక నాణ్యత, స్థిరమైన వృద్ధిని సాధించే  వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయమని తెలిపింది.   అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఉన్నత స్థాయి అధికారులకు, బోర్డు సభ్యులు,  వైస్-ప్రెసిడెంట్లు ఇందులో ఉన్నారని వెల్లడించింది.

ఇది  వారి ర్యాంక్‌ల ఆధారంగా ఉండనుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా  రిజైన్‌ చేసిన ఉద్యోగులకు  కనీసం  తొమ్మిదినెలల  జీతాన్ని పరిహారంగా  చెల్లించనుంది.  దాదాపు మూడు నెలల నుంచీ చర్చలు జరుగుతున్నాయన్నారు. కనీసం 40 లక్షల రూపాయల జీతాన్ని అందుకునే  ఉద్యోగులు  ఈ పథకం కిందికి వస్తారని చెప్పాయి.

పరిహారంపై  అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ప్రోత్సాహక వివరాలు వెల్లడించలేదు కానీ, కంపెనీని వదిలివేయడానికి ఎంచుకునేవారికి ఇది మంచి ,అనుకూలమైన అనుభవాన్ని అందిస్తుందని తాము నమ్ముతున్నామన్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కంపెనీ  కార్యకలాపాల విస‍్తరణ కొనసాగుతుందని,  తన ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను అందించడానికి నిపుణులైన ఉద్యోగుల ఎంపిక కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *