హార్ట్ టచింగ్ , ఫీల్ గుడ్ తో ‘అ..ఆ’ కథ ఇదే రివ్యూ

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అ..ఆ’. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈచిత్రం ఈ రోజు (జూన్ 2న) ప్రపంచవ్యాప్తంగా భారి ఎత్తున విడుదల అయ్యింది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆయా సెంటర్ల నుంచి అందుతున్న రిపోర్ట్ పాజిటివ్ గా , మంచి హిట్ టాక్ తో ఉంది.

మరి ఈ చిత్రం కథ ఏమిటో కూడా ఓ సారి చూద్దాం. ఎప్పటిలాగే…త్రివిక్రమ్ కథ, మాటలు, స్రీన్ ప్లే అందించిన ఈ చిత్రం ఆడియన్స్ బ్రెయిన్ కు పెద్దగా పనిపెట్టకుండా హాయిగా సాగిపోయింది. మహాలక్ష్మి (నదియా) హైదరాబాద్ లో ఓ సక్సెస్ ఫుల్ పారిశ్రామిక వేత్త. అలాగే బొమ్మరిల్లులో ప్రకాష్ రాజు టైప్ లో , ఇంకా చెప్పాలంటే అత్తారింటికి దారేదిలో తను చేసిన పాత్రలాంటి డామినేటింగ్ క్యారక్టర్. ఆమె తన భర్త రామలింగం(నరేష్), అనసూయ(సమంత) తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూంటుంది. మహా లక్ష్మి ప్రతీ విషయంలోనూ తన కుమార్తె జీవితాన్ని కంట్రోలు చేస్తూ, తనే నిర్ణయాలు తీసుకుంటూంటుంది. పర్శనల్ గానూ, ప్రొపిషనల్ గానూ ఆమె నిర్ణయాలే ఇంట్లో అమలు అవుతూంటాయి. తన భర్త మాట అంటే అసలు లెక్కలేదు.

తల్లి డామినేటింగ్ నేచుర్ కు విసుగెత్తిపోయిన అనసూయ.. సూసైడ్ ఎటెమ్ట్ చేస్తుంది. అయితే అదృష్టం బాగుండి బ్రతుతుకుంది. దాంతో ఆమె తండ్రి ముందు ఈ పరిస్దితుల నుంచి బయిట పడేయటం కోసం అనసూయను ఆమె మామయ్య విలేజ్ కలవపూడి కు పంపుతాడు. అక్కడ ఆమెకు ఆనంద్ విహారి(నితిన్) బావ ఉంటాడు. అక్కడ ఆ విలేజ్ లో ఆమె ఓ పదిరోజులు గడుపుతుంది. ఆమె తన జీవితాన్ని తాను బ్రతికి ఎంజాయ్ చేస్తుంది తొలిసారిగా. అక్కడ ఆ విలేజ్ లో పల్లెం వెంకటేష్(రావు రమేష్) అతని కొడుకు (అజయ్) ఉంటారు. వెంకటేష్ కు ఓ కుమార్తె నాగవల్లి(అనుపమ పరమేశన్). . ఇవి.. ఈ సినిమా కథ జరిగే నేపధ్యం. ఈ పాత్రల మధ్య ఏం జరుగుతుంది. నితిన్, సమంత మధ్య జరిగే ప్రేమ కథేంటి.. పది రోజుల తర్వాత ఆమె సిటికి వచ్చినప్పుడు ఆమె లో వచ్చే మార్పులు ఏమిటి వంటి విషయాలను ఫన్నీగా, ఎమోషనల్ గా చెప్తూ సాగుతుందీ చిత్రం.

త్రివిక్రమ్ తన తొలి రోజుల నాటి చిరు నవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు తరహాలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని రూపొందించారు. అలాగే ఈ సినిమా పూర్తిగా నీట్ కామెడీతో సాగే క్లీన్ మూవి, త్రివిక్రమ్ ఫన్ డైలాగులుకు తోడు సెంటిమెంట్ ని బాగా అద్దారు. అయితే సినిమా కాస్త స్లో పేస్ లో నడుస్తుంది. సెకండాఫ్ లో ముఖ్యంగా ప్రెడిక్టబుల్ సీన్స్ తో సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ చాలా డల్ గా అనిపించి నా, క్లైమాక్స్ కు వచ్చేసరికి ఎక్సలెంట్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో మనం పాతం త్రివిక్రమ్ ని చూడవచ్చు. ఆయన రైటింగ్ స్కిల్స్ దర్శకుడుని డామినేట్ చేస్తాయి.

హార్ట్ టచింగ్ తో, ఫీల్ గుడ్ తో సాగే క్లైమాక్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ మనస్సు గెలిచే ప్రయత్నం చేసారు. ఈ మద్యకాలంలో ఓ మామూలు ఆర్డనరీ ఫ్యామిలీ కథకు అంత అందమైన క్లైమాక్స్ కుదరలేదు. సినిమాలో నెగిటివ్ ఏమిటీ అంటే సినిమా సెకండాఫ్ లో స్లో అవటమే. ఫైనల్ గా త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంత హీరోయిన్ గా తొలిసారిగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా ‘ అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.

ప్లస్ పాయింట్స్ :
సమంత క్యారెక్టర్
ఫస్ట్ హాఫ్ విలేజ్ సీన్స్
క్లైమాక్స్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :
త్రివిక్రమ్ మార్క్ పెద్దగా లేకపోవటం
రొటీన్ టేకింగ్

టైటిల్ : అ.. ఆ..
జానర్ : ఫ్యామిలీ డ్రామా
తారాగణం : నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్, నదియా, నరేష్, రావు రమేష్
సంగీతం : మిక్కీ జే మేయర్
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : సూర్యదేవర రాధాకృష్ణ

రేటింగ్ : 3.25/5

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *