షేక్ చేసేందుకు : ఒకే నిర్మాత 5 సినిమాలు ప్రకటన

పంపిణీ రంగంలో నెంబర్ వన్ స్దానంలో వెలుగుతున్నారు అభిషేక్ పిక్చర్స్. వరసపెట్టి పెద్ద సినిమాలు… ‘శ్రీమంతుడు’, ‘రుద్రమదేవి’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సుప్రీమ్‌’, ‘కబాలి’ వంటి సహా అనేక భారీ చిత్రాలను పంపిణీ చేసిన ఈ సంస్ద ఇప్పుడు నిర్మాణ రంగంలోకి వస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా కలిగిన ఆ సంస్థ అధినేత అభిషేక్‌ నామా ఇప్పుడు నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెడుతున్నామని చెప్తున్నారు. ఐదు సినిమాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ ఐదు చిత్రాల వివరాలు..

సినిమా తీయడమంటే ఒకటి తర్వాత ఒకటి కూడా కాదు.. ఒకేసారి ఐదు సినిమాలను అభిషేక్ పిక్చర్స్ నిర్మించనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా స్టార్ట్ కానుంది. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో చిత్రం కూడా అభిషేక్ పిక్చర్స్ నిర్మించనుంది. క్షణం దర్శకుడు రవికాంత్ పెరెపు తీసే రెండో సినిమాకి నిర్మాణం వహించేది కూడా ఈ సంస్థే. సుధీర్ బాబు హీరోగా పుల్లెల గోపీచంద్ బయోపిక్ ని తీసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైపోయింది.

శ్రీనివాస్ అవసరాల లీడ్ రోల్ లో చేయనున్న బాలీవుడ్ హంటర్ రీమేక్ ప్రాజెక్ట్ రీసెంట్ గా కన్ఫాం అయింది. ఒకే సారి 5 సినిమాల నిర్మాణం.. అన్నీ క్రేజీ డైరెక్టర్లు హ్యాండిల్ చేసేవే. అభిషేక్ పిక్చర్స్ అడుగు పెట్టడంతోనే షేక్ చేసే ప్లాన్స్ ఏవో వేసుకుని వచ్చేస్తున్నట్లుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *