అలా అనటానికి సిగ్గు లేదూ…కాళ్లు విరగ్గొడతా… టీవి షో లో నటి గీత, క్షమాపణకు డిమాండ్

‘ఒక యువతి నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు కూడా ఓ అమ్మాయివన్న విషయాన్ని మర్చిపోయావా’ అనేది ఏ బి గ్రేడ్ సినిమాల్లో కనిపించే డైలాగు అనుకోకండి. మనం నిత్యం చూసే టీవీ ఛానెల్స్ లో కనపించే వాస్తవం ఇది. టీఆర్పీల కోసం టీవీ ఛానెల్స్ రోజు రోజుకూ కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కావాలని వివాదాలను రాజేస్తున్నాయి. ముఖ్యంగా టీవీ షోలు చూస్తూంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది సామాన్యులకు. ఆ షోలలో వచ్చే వివాదాలు, వాదాలు నిజమేనా లేక కావాలని క్రియేట్ చేస్తున్నారో అర్దం కాని పరిస్దితి ఏర్పడుతోంది.

ముఖ్యంగా ఫ్యామిలీలలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపెడతామంటూ మొదలైన టీవీ షోలు గురించి అయితే చెప్పక్కర్లేదు. అవి చూస్తూంటే అసలు మన చుట్టు ప్రక్కల ఏం జరుగుతోందో అనే సందేహం, సమాజంలో ఇలాంటి మనుష్యులతో నిండిపోతోందా అనే భయం ఏర్పడుతుంది. చిన్న సమస్యను గ్లోరిఫై చేసి చూపెడుతూ…పదే పదే వివాదానికి దారితీసే విధంగా ఈ షోలను డిజైన్ చేస్తున్నారు.

సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టీఆర్పీ ల కోసమో లేక నిజంగా వచ్చిన ఎమోషన్ తో మాట్లాడిందో కానీ మాజీ సినీ నటి బ్రతుకు జట్కాబండి పోగ్రామ్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా సంచలనం గా మారాయి. దానిపై రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా ఓ చానల్‌లో ప్రసారమయ్యే ఇలాంటి ఓ షోలో నటి గీత వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ఓ లెస్బియన్ జంట టీవీ షోకొచ్చింది. ఆసక్తిరేపే విధంగా పోగ్రామ్ డిజైన్ చేసారు కానీ కాస్త ఓవర్ అయ్యారనే అంటున్నారు.

ఆ పోగ్రామ్ కు వచ్చిన ఆమె…తను సిందు అనే అమ్మాయితో ఉంటున్నాను అని చెప్పింది. ఆమెతో ఏ విధమైన రిలేషన్. మంచిగా చూసుకుంటుంది అంటే..మంచి బట్టలు కొనిస్తారనా, చదువుకోవటానికి ప్రోత్సహిస్తారనా.. లేకపోతే ఎందుకు సింధు అంటే అంత అభిమానం అని తరిచి తరిచి అడిగారు.ఆమె నోటి నుంచి ఏదో చెప్పించాలనే విషయం అక్కడ కనపడుతోంది.

అన్ని రకాలుగా ఇష్టపడ్డాను అంటే.. అన్నిరకాలుగా ఇష్టపడ్డాను అంటే…… ఇన్నాళ్లూ నా తల్లితండ్రులు ఇవ్వలేదు కాబట్టి..ఇప్పుడు సింధు ఇస్తోంది కాబట్టి ఆమెను ఇష్టపడుతున్నావా అని పోగ్రామ్ యాంకర్స్ అడిగారు. దానికి ఆమె కాదు..ఆమెను ఇష్టపడ్డాను. ఆమెను ఇష్టపడినంతగా ఇంక ఎవరినీ ఇష్టపడలేదు అని ఆమె చెప్పింది. ఆ విధంగా నిన్ను ఎవరూ చూసుకోరా జీవితంలో నిన్ను అని యాంకర్ మరింత స్పష్టత కోసం అన్నట్లుగా అడిగారు.

ఏ రకంగా శారీరకంగా.. ఎలా చెప్పగలవు…ఇంత చిన్న వయస్సులో ఎవరూ చూసుకోలేరు అని…అయినా .ఒకే ఇష్యూ అడుగుతాను సింధు ఎందుకుకావాలి అని యాంకర్ రెట్టించారు. దానికి ఆమె దాంతో ఉంటే హ్యాపీగా ఉంటుంది అని షోకు వచ్చినామె చెప్పింది. ఏ విధంగా హ్యాపీగా ఉంటావు.. అంటే అన్ని రకాలుగా అంటే ..మళ్లీ ఏ రకం అని రెట్టించి అడిగారు. ఒక రకంగా అంటే మానసింకగానా, శారీరకంగానా అని అడిగారు. అంతేకాకుండా..సింధు ప్లేస్ లో ఎవరిని పెట్టినా కుక్కలని పెట్టినా, పువ్వులని పెట్టినా హ్యాపీగా ఉంటావా అని అడిగారు.

అమ్మాయి..అమ్మాయి కలిసి ఉండచ్చా సమాజంలో ఉండే వ్యతిరేకతను నిలదొక్కుకుని జీవించగలరా అని అడిగారు. సమాజం నాకు అవసరం లేదు అని ఆమె చెప్పింది. ఎలా అవసరం లేదమ్మా..మనం అడవిలో లేము కదా అని అని షో నిర్వాహకలు ప్రశ్నించారు. అంతేకాకుండా మీ అక్క ఎవరిని చేసుకుంది..అబ్బాయిని కదా. మరి సిందు ఎవరో చెప్పు ఫస్ట్.. అమ్మాయి కదా.. అమ్మాయి..అమ్మాయి ఇద్దరు కలిసి ఉండచ్చా అని డైరక్ట్ గా ఆమెను అడిగారు. ఆమె ఉంటాము అని సమాధానమిచ్చింది.

నాకు శారీరకంగా ఎవరి అవసరమూ లేదు , ఆమెతో ఉంటాను ఆమె స్పష్టంగా చెప్పింది. దానికి షోకు వచ్చిన మరొకరు..నీకు ఇప్పుడు ఉండకపోవచ్చు..తర్వాత కూడా ఉండవని ఎలా చెప్పగలవు అని అడిగారు. ఇవేనా ఆడపిల్లకు కావాల్సింది రేపు మీకు పిల్లలు కావాలి అని అనిపిస్తే..అని అడిగారు. దానికి ఆమె మేం మొదట అనుకున్నాం..మాకు పిల్లలు వద్దు అని ఆమె చెప్పారు. ఒక ఆడపిల్లకు రెండే కోరికలు ఉంటాయి. ఒకటి ఒక మంచి భర్త దొరకాలి, ఇంకొకటి తనకు కావాల్సిన పిల్లలకు ఒక మంచి తండ్రి కావాలని అంటూ యంకర్ చెప్పి ఆమెను ఈ విషయమై ప్రశ్నించారు.

కాళ్లు విరగకొడుతా...ఏం అయితే ఓ సందర్భంలో కోపాన్ని అణచుకోలేక, ఆగ్రహంతో ఊగిపోయిన గీత ‘ఒక అమ్మాయివి అయ్యి ఉండి వేరే అమ్మాయితో గడపడం సిగ్గుగా లేదా అని ప్రశ్నించింది. నిన్ను కొట్టి, కాళ్లు విరగ్గొడతానంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

దీంతో ఈ షోపైనా, గీత పైన హైద్రాబాద్ లెస్బియన్స్ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఈ విషయం మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Videos

4 thoughts on “అలా అనటానికి సిగ్గు లేదూ…కాళ్లు విరగ్గొడతా… టీవి షో లో నటి గీత, క్షమాపణకు డిమాండ్

Leave a Reply

Your email address will not be published.