అజ్ఞాతవాసి ఆడియో హై లైట్స్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉత్సాహం, ఉద్వేగం పీక్స్ కు చేరిన వేళ అంగరంగ వైభవంగా అజ్ఞాతవాసి ఆడియో వేడుక నిన్న హైదరాబాద్ నోవాటెల్ లో జరిగింది. ముఖ్య అతిధులంటూ ఎవరూ లేకుండా కేవలం యూనిట్ మెంబెర్స్ మాత్రమే ఉన్న ఈ ఫంక్షన్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. చిరు, తారక్, వెంకీ వీరిలో ఎవరైనా వస్తారేమో అని ఆశించిన ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. నిన్నటి ఫంక్షన్ లో హై లైట్స్ ఏంటో చూద్దాం ..

*నోవాటెల్ మార్గం మొత్తం ఈవెంట్ ప్రారంభానికి ముందు, తర్వాత విపరీతమైన ట్రాఫిక్ తో చాలా సేపు బ్లాక్ అయ్యింది

*పవన్ త్వరగా వస్తాడు అని ప్రచారంలో ఉన్నా యధావిధిగా రెండు గంటల తరువాతే వచ్చాడు

*పవన్ పాడిన కోటేశ్వరరావు కొడుకో పాట మాత్రం నిన్న రిలీజ్ చేయలేదు. న్యూ ఇయర్ సందర్బంగా 31 రాత్రి విడుదల కానుంది

*ట్రైలర్ చూపిస్తారేమో అనుకున్న ఫ్యాన్స్ కూడా డిజపోయింట్ కాక తప్పలేదు. అది కూడా 26న నేరుగా ఆన్లైన్ లో వదలుతారు

*పవన్ కళ్యాణ్ 21 నిమిషాల పాటు ప్రసంగించడం విశేషం

*కీర్తి సురేష్ మరీ బామ్మ తరహాలో చేయి, మొహం తప్ప శరీరంలో ఇంకే చర్మ భాగం కనిపించకుండా వేసుకొచ్చిన డ్రెస్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు

*రావు రమేష్ నితిన్ తరఫున స్టేజిపైనే స్పెషల్ విషెస్ చెప్పాడు

*బోమన్ ఇరానీ కథ వినకుండా ఒకే చేసిన మొదటి సినిమా ఇదేనని, కారణం పవన్, త్రివిక్రమ్ అనే రెండు పేర్లు అన్నప్పుడు హాల్ హోరెత్తిపోయింది

*ఖుష్బూ స్టాలిన్ పేరుని మెన్షన్ చేస్తూ అన్నయ్య చిరంజీవి తరవాత తాను నటిస్తోంది పవన్ సినిమాలోనే అని చెప్పడం ఫ్యాన్స్ కి బాగా కిక్ ఇచ్చింది

*సెక్యూరిటీ కళ్ళు గప్పి ఒక అభిమాని పవన్ దాకా వెళ్లి కాళ్ళు పట్టేసుకున్నాడు. బౌన్సర్లు లాగబోతే వారిని వారించి పవన్ అతనితో సెల్ఫీ దిగటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది

*రకరకాల కాస్ట్యూమ్స్ తో సినిమాలో ఉన్న అన్ని పాటలకు అనిరుధ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది

*ఆది పినిశెట్టి తన చిన్నతనంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సిడి ప్లేయర్ ని బాగు చేయటం గురించి గుర్తు చేయటం పవన్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది

*అను ఇమ్మానియేల్ చక్కని తెలుగులో మాట్లాడుతూ సొగసైన చీరకట్టుతో ఊగుతున్న నడుముతో చూపు పక్కకు తిప్పుకొనివ్వకుండా చేసింది

*తనికెళ్ళ భరణి, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఫ్యాన్స్ కు హుషారు వచ్చేలా మాట్లాడ్డం ఆకట్టుకుంది

*లైవ్ అని చెప్పిన న్యూస్ ఛానెల్ యాడ్స్ కోసం సుమారు 15 నిమిషాలకు పైగా ఆలస్యంగా టెలికాస్ట్ చూపించింది. దీంతో విసుగొచ్చిన అభిమానులు దాని కన్నా మెరుగ్గా వస్తున్న మరో మ్యూజిక్ ఛానల్ లైవ్ కి షిఫ్ట్ అయ్యారు. అందులో కరెక్ట్ గానే వచ్చింది

*హారిక అండ్ హాసిని అఫీషియల్ యు ట్యూబ్ ఛానల్ లో లక్షన్నర దాకా లైవ్ చూస్తూ ఉండటం కూడా ఒకరకంగా రికార్డ్ అనే చెప్పాలి

*3 గంటలకు పైగా సాగిన ప్రోగ్రామ్ బయటివాళ్ళు చూడటం కోసం ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేయటం విశేషం

అతిధులు అంటూ ఎవరు లేకపోయినా పవన్ ఉంటే చాలు అనే కిక్కిరిసిన అభిమానుల మధ్య అజ్ఞాతవాసి ఆడియో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోయింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *