70 వేల జాకెట్ వేసుకున్న రాహుల్.. ఆడుకున్న బీజేపీ!

సూట్ బూట్ సర్కార్.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇది. అప్పుడెప్పుడో మోదీ పది లక్షల విలువైన సూట్ వేసుకున్నాడంటూ అప్పటి నుంచి రాహుల్ మోదీ సర్కార్‌కు ఈ పేరు పెట్టేశారు. కానీ ఇప్పుడు రాహుల్ కూడా అడ్డంగా దొరికిపోయారు. మేఘాలయలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారానికి వెళ్లిన రాహుల్.. సెలబ్రేషన్ ఆఫ్ పీస్ పేరుతో ఓ మ్యూజిక్ షో నిర్వహించారు. దీనికి రాహుల్ రూ.70 వేల విలువైన ఓ కాస్ట్‌లీ జాకెట్ వేసుకొని వచ్చారు. అంతే.. బీజేపీ వెంటనే అందుకుంది. మేఘాలయ బీజేపీ యూనిట్ ఈ ఫొటోలను ట్విట్టర్‌లో పెట్టి రచ్చరచ్చ చేసింది. ఓ మ్యూజికల్ ఈవెంట్‌కు రాహుల్ కాస్ట్‌లీ జాకెట్ ధరించి వచ్చారంటూ ప్రచారం చేసింది. మేఘాలయలో అడ్డదిడ్డంగా అవినీతికి పాల్పడి సంపాదించిన బ్లాక్‌మనీతో ఈ జాకెట్ కొన్నారా అంటూ బీజేపీ ట్వీట్ చేసింది.

రాహుల్ వేసుకున్న జాకెట్.. బ్రిటన్‌కు చెందిన బర్‌బెర్రీ అనే ఓ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్. ఈ జాకెట్ విలువ బ్లూమింగ్‌డేల్స్ వెబ్‌సైట్‌లో రూ.68,145గా ఉంది. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇండియా వచ్చిన సమయంలో మోదీ ఓ కాస్ట్‌లీ సూట్ వేసుకున్న విషయం తెలిసిందే కదా. అప్పటి నుంచి రాహుల్ మోదీ సర్కార్‌ను సూట్‌బూట్ సర్కార్ అనడం మొదలుపెట్టారు. ఆ సూట్‌ను ఆ తర్వాత వేలంలో కనీస ధర రూ.11 లక్షలుగా నిర్ణయించి అమ్మకానికి పెట్టారు. అది చివరికి రూ.4.31 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. ఇప్పుడు రాహుల్‌గాంధీ ఈ కాస్ట్‌లీ జాకెట్‌తో అటెండైన మ్యూజిక్ షో ఫొటోలను కాంగ్రెస్ కూడా ట్వీట్ చేసింది.

Videos

13 thoughts on “70 వేల జాకెట్ వేసుకున్న రాహుల్.. ఆడుకున్న బీజేపీ!

Leave a Reply

Your email address will not be published.