శశికళ భర్తపై అన్నాడీఎంకే దాడి..ఎలా కొట్టారో చూడండి

దివంగ‌త త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత త‌మిళ‌నాట అధికార పార్టీలో పాలిటిక్స్ హీటెక్కాయి. రోజు రోజుకు అటు పార్టీలోను, ఇటు ప్ర‌భుత్వ ప‌రంగాను ఎప్పుడు ఏం జ‌రుగుతుందో కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళ పార్టీ ప‌రంగా ప‌ట్టు సాధించేందుకు స్కెచ్‌లు వేయ‌డంతో పాటు సీఎం పీఠంపై క‌న్నేసి తెర‌వెన చాలా మంత్రాంగ‌మే న‌డుపుతున్నారు.

ఇదిలా ఉంటే చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద శ‌శిక‌ళ భ‌ర్త‌పై అన్నాడీఎంకే పార్టీ కార్య‌క‌ర్త‌లు దాడి చేసి చిత‌క్కొట్టారు. అయితే ఈ దాడి జ‌రిగింది అమ్మ నెచ్చెలి అయిన శ‌శిక‌ళ‌పై కాదు సుమా…! జ‌య ఉండ‌గానే ఆ పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన రాజ్య‌స‌భ స‌భ్యురాలు శ‌శిక‌ళ పుష్ఫ‌. అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎంపీ శశికళా పుష్ప భర్త, ఆమె తరఫు లాయర్లపై పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. శ‌శిక‌ళ పుష్ఫ భ‌ర్త‌ను చిత‌క్కొట్టారు. దీంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పార్టీ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు.

గ‌తంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డీఎంకే పార్టీకి చెందిన ఓ రాజ్య‌స‌భ స‌భ్యుడిని ఆమె చెంప‌మీద కొట్ట‌డంతో ఆగ్ర‌హించిన జ‌య ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ త‌ర్వాత అమ్మ ఉండ‌గానే ఆమెను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. జయలలిత వారసురాలి ఎంపికకు గురువారం పార్టీ కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ దాడి ఘటన జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పుష్ప నామినేషన్ పత్రం తీసుకుని ఆమె భర్త, లాయర్లు పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు వ‌చ్చారు.

దీంతో అమ్మ నెచ్చెలి శిశకళా నటరాజన్ మద్దతుదారులు కొందరు వారిని అడ్డుకుని దాడి చేశారు. శశికళా నటరాజన్‌కు పార్టీ సభ్యత్వం లేదని, అందువల్ల పోటీకి ఆమె అర్హురాలని, ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి కాకుండా తాను అడ్డుకంటానని శశికళ పుష్ప ప్రకటించారు. ఈ ఘ‌ట‌న‌ను ఖండించిన శ‌శిక‌ళ పుష్ఫ తాను ఇప్ప‌ట‌కీ పార్టీ ఎంపీనేన‌ని, త‌న స‌భ్య‌త్వం ర‌ద్దు కాలేదని…. జనరరల్ సెక్రటరీ ఎన్నికలో పోటీకి తనకు అవకాశం ఉందని…ఈ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.