రిలయన్స్ ఒడిలోకి ఎయిరసెల్

దేశీయ మొబైల్‌ రంగంలో మరో సంచలనానికి రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌  తెరలేపనుంది . ఇప్పటికే ఎంటీఎస్‌ను విలీనం చేసుకునే క్రమంలో ఉన్న సంస్థ, అదే మార్గంలో ఎయిర్‌సెల్‌తో సంప్రదింపులు ప్రారంభించింది.3 సంస్థలు విలీనమైతే, 20 కోట్ల మంది చందాదారులున్న కొత్త సంస్థ అవతరించడంతో పాటు 2జీ, 3జీ, 4జీ సేవలను అందించేందుకు వీలవుతుంది.
మొబైల్‌ వ్యాపారాన్ని విలీనం చేసేందుకు ఉన్న అవకాశాలపై ఎయిర్‌సెల్‌ వాటాదార్లతో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌  చర్చలు జరుపుతోంది. రెండు సంస్థల కలయికను పరిగణనలోకి తీసుకునేందుకు ప్రత్యేక ఎయిర్‌సెల్‌ లిమిటెడ్‌ వాటాదార్లైన మ్యాక్సిస్‌ కమ్యూనికేషన్స్‌ బెర్హాద్‌,సింద్యా సెక్యూరిటీస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లతో అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 90 రోజుల ప్రత్యేక కాలపరిమితి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే ఎంటీఎస్‌ బ్రాండ్‌పై సేవలందిస్తున్న సిస్టెమా శ్యామ్‌ టెలిసర్వీసెస్‌ దేశీయ టెలికాం వ్యాపారాన్ని విలీనం చేసుకునే ప్రక్రియంలో ఆర్‌కామ్‌ ఉన్న సంగతి విదితమే. తాజా సంప్రదింపులు ఫలిస్తే, ఎయిర్‌సెల్‌ వ్యాపారం కూడా కలుస్తుంది.
ఆర్‌కామ్‌, ఎంటీఎస్‌, ఎయిర్‌సెల్‌ కంపెనీల మొబైల్‌ వ్యాపారం మొత్తాన్ని ఆర్‌కామ్‌ నేతృత్వంలోని కొత్త కంపెనీ నిర్వహించాలన్నది సంస్థ ప్రతిపాదన అని విశ్వసనీయ సమాచారం. సంయుక్త భాగస్వామ్య సంస్థను వాటాల పంపిణీ పద్ధతిలో నెలకొల్పాలన్నది ఆర్‌కామ్‌ వాటాదార్ల ఆలోచన. ఆర్‌కామ్‌ ఒక షేరుకు ఎయిర్‌సెల్‌ షేర్లు 3 ఇవ్వాలన్నది వారి ప్రతిపాదన.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *