రిల‌య‌న్స్ వ‌ర్సెస్ ఎయిర్‌టెల్‌

ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా రిల‌య‌న్స్ సంస్థ కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన జియో గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. రిల‌య‌న్స్ జియో పేరుతో 4జీసేవ‌ల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తూనే మిగిలిన టెలికం కంపెనీల‌కు పెద్ద షాక్ ఇచ్చింది. రిల‌య‌న్స్ దెబ్బ‌తో మిగిలిన టెలికం కంపెనీలు దిగి వ‌స్తున్నాయి.

రిల‌య‌న్స్ జియోకు పోటీగా ఎయిర్ టెల్ ఓ భారీ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.51 కే వన్ జీబీ 3జీ లేదా 4జీ డేటా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం 28 రోజుల వాలిడిటీతో రూ.259కి ఒక జీబీ 4జీ డేటాను ఎయిర్ టెల్ కస్టమర్లకు అందిస్తోంది.

అయితే 4జీ డేటాను భారీగా తగ్గించే క్రమంలో కూడా ఎయర్ టెల్ ట్విస్ట్ మొదలుపెట్టింది. ముందుగా రూ.1498 రీచార్జ్ చేసుకున్న వారికి ఈ స్వల్ప నూతన ప్లాన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రూ.1498 ప్లాన్ లో 1 జీబీ 3 జీ లేదా 4జీ డేటా 28 రోజుల వరకు ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత రూ. 51కే ఒక జీబీ 3జీ లేదా 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చు.

12 నెలల వరకు ఎన్నిసార్లయినా రూ.51కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ తెలిపింది. మరో ఆసక్తికరమైన ఆఫర్ ను కూడా ఎయిర్ టెల్ ప్రకటించింది. రూ.748 రీచార్జ్ చేసుకుంటే ఆరు నెలల వరకు ఎన్నిసార్లయినా రూ.99 కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చు. మ‌రి ఎయిర్‌టెల్ జియోకు పోటీగా ఈ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. మిగిలిన టెలికం కంపెనీలు మ‌రెన్ని కొత్త ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తాయో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *