ఆ నిర్మాత ఓ పంది… ఐశ్వర్య రాయ్‌ మీద కన్నేశాడు, మాజీ మేనేజర్ సంచలనం!

ఇండియాకు చెందిన అందగత్తెల లిస్టు తయారు చేస్తే అందులో టాప్ లో ఉండే పేరు ఐశ్వర్యరాయ్. ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకోవడం ద్వారా దేశ ప్రతిష్టను ప్రపంచ నలుదిశలా వ్యాపింప చేసిన ఐశ్యర్య బాలీవుడ్ సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా తన సత్తా చాటారు. 40 ఏళ్ల వయసులోనూ వన్నెతరగని అందంతో ఐష్ ఇతర హీరోయిన్లు పోటీ ఇస్తుండటం విశేషం.

అయితే ఈ అందాల ముద్దుగుమ్మకు ఓ పెద్ద ప్రమాదం తప్పింది.. అదేంటంటే ఓ హాలీవుడ్ నిర్మాత కామదాహం నుంచి ఐశ్వర్యరాయ్ తప్పించుకుంది. అవును… హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టైన్‌.. ఐశ్వర్య రాయ్‌ పై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకోవాలని అనుకున్నాడు. ఆమెతో పడక సుఖం కోసం ప్రయత్నించాడు. ఈ విషయాన్ని అప్పట్లో ఐశ్వర్యరాయ్ మేనేజర్‌గా పని చేసిన సిమోనె షెఫీల్డ్ షాకింగ్ విషయం బయట పెట్టింది.

ఐశ్వ‌ర్య‌తో ఒంట‌రిగా స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని తనను హార్వే వెయిన్‌స్టన్ చాలా సార్లు బలవంతం పెట్టాడని, అతడి మనసులో ఉన్న తప్పుడు ఉద్దేశ్యం తాను ముందే పసిగట్టి తాను ఏర్పాటు చేయను అని మొహం మీదే చెప్పానని సిమోనె షెఫీల్డ్ తెలిపారు.ఐశ్వ‌ర్య‌ను ఒంట‌రిగా క‌ల‌వ‌డానికి హార్వే తీవ్రంగా ప్రయ‌త్నించేవాడు. మేం ముగ్గురం మాట్లాడుతున్న‌పుడు న‌న్ను అక్క‌డి నుంచి వెళ్లిపోమ‌నేవాడు. ఒక‌రోజు ఎలాగైనా ఐష్‌తో ఒంట‌రిగా స‌మావేశం ఏర్పాటు చేయ‌మ‌ని, అందుకోసం ఏమైనా చేయడానికి తాను సిద్ధమని న‌న్ను వేడుకున్నాడని, తనను భయపెట్టాడని కానీ నేను భయపడలేదని సిమోనె షెఫీల్డ్ వెల్లడించారు. అతన్ని ఐష్‌ ఛాయలకు కూడా రానివ్వలేదు’ అనిచెప్పుకొచ్చిందామె.

ఇప్పటికే పలువురు హాలీవుడ్‌ నటీమణులు హార్వే తమపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. అతను చాలా మంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఇతడి వాకాలం తెలిసి భార్య కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది.

Videos

Leave a Reply

Your email address will not be published.