జ్యోతిలక్ష్మి విలన్.. దారుణమైన కామెంట్స్

”ఆస్కార్ కోసం సెలక్ట్ అయిన విసరనై సినిమాలో నేను నటించానని నా మాతృ ఇండస్ర్టీ అయిన తెలుగు ఇండస్ర్టీ గుర్తించలేదు.. కాని తమిళవారు మాత్రం గుర్తించారు. ఈ సినిమాలో నటించినందుకు నాకు ఫోన్లు చేసి ఇంటర్యూలు అడిగారు తమిళ మీడియావారు” అంటూ తమిళ మీడియాను ఆకాశానికి ఎత్తేశాడు నటుడు అజయ్ ఘోష్. చెన్నయ్ లో రెండు రోజుల క్రితం జరిగిన ”తప్పు తాండా” సినిమా ఆడియో లాంచ్ లో ”జ్యోతిలక్ష్మి” ఫేం అజయ్.. ఈ కామెంట్లు చేశాడు.

”నాకు తెలుగు కంటే కూడా తమిళ ఇండస్ర్టీలో పనిచేయాలని చాలా ఆశ ఉండేది. నేను కమ్యూనిష్టు పార్టీ బ్యాగ్రౌండ్ నుండి రావడం వలన.. తెలుగు ఇండస్ర్టీలో ఇబ్బంది పడ్డాను. కెమెరా ముందు యాక్ట్ చేయడం వచ్చు కాని.. కెమెరా వెనుక యాక్టింగ్ చేయడం రాదు. కాని గ్రేట్ తమిళ ఇండస్ర్టీలో వెట్రిమారన్ నాకు అవకాశం ఇచ్చారు.. ఒక కొత్త జన్మ ఇచ్చారు. తమిళ పీపుల్ గ్రేట్ అంతే. ఇక్కడ వీరకు బిల్డప్ లు లేవు. తమిళ జనాలకు సోషల్ అండ్ పొలిటికల్ అవగాహన చాలా ఎక్కువ. వెట్రిమారన్ తో 28 రోజులు పనిచేశాను.. ఆ వర్క్ చాలా గ్రేట్ అంతే. శిరస్సు వంచి తమిళ ఇండస్ర్టీ వారికి పాదాభివందనం చేస్తున్నా” అంటూ స్పీచ్ ఇచ్చాడు ఈ విలన్.

”చెన్నయ్ లో ఖాళీగా ఉన్న ఆటోవాళ్ళు పేపర్ చదువుతుంటారు. అదే మా దగ్గర అయితే పాన్ తింటూ ఉంటారు. అలాగే అక్కడి సాంబార్ తింటే మోషన్స్ అవుతాయి. ఇక్కడ తింటే వావ్” అంటూ వ్యంగ్యాస్ర్తాలు విసిరేశాడు.

ఇటు తెలుగు ఇండస్ర్టీని అటు తెలుగు మీడియాను ఈ విధంగా కామెంట్ చేసిన అజయ్ పై మనోళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published.