అంబానీ కొడుకును ప్రేమలో దింపింది, ఎవరా హీరోయిన్?

స్టార్ హీరోయిన్లంతా…. పడితే గిడితే బాగా డబ్బున్న వ్యాపార వేత్తలతోనో, లేదా నిర్మాతలతోనే, స్టార్ హీరోలతో ప్రేమలో పడటం, వారితోనే పెళ్లికి సిద్ధమవ్వడం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ప్రేమ వ్యవహారాలు, ఎఫైర్లు…. తదితర అంశాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా…. ఇటీవలే యంగ్ హీరో రణబీర్ కపూర్ తో బ్రేకప్ చేసుకుంది. తాజాగా ఆమె మరొకరితో లవ్ ఎఫైర్ మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లక్షల కోట్లకు అధిపతి, దేశంలోని అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీతో కత్రినా కైఫ్ ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల దీపావళి సందర్భంగా బిగ్‌బి అమితాబ్‌ ఇంట్లో గ్రాండ్‌గా పార్టీ జరిగింది.

ఈ పార్టీకి ఆకాశ్‌అంబానీ, కత్రినాలు కలిసి ఒకే కారులో రావడం…. ఆ తర్వాత అనిల్‌ కపూర్‌ ఇంటికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లడం, ఇద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడంతో ఇద్దరూ డేటింగులో ఉన్నారని, ఇద్దరి మద్య క్లోజ్ రిలేషన్ షిప్ నడుస్తోందని అంటున్నారు. మరి వీరి ప్రేమ వ్యవహారం ఎక్కడి వరకు వెలుతుందో చూడాలి.

Videos

24 thoughts on “అంబానీ కొడుకును ప్రేమలో దింపింది, ఎవరా హీరోయిన్?

Leave a Reply

Your email address will not be published.