అఖిల్ పెళ్లిపనులు మొదలైపోయాయ్

అక్కినేని వారసుడు అఖిల్ కు.. జీవీకే మనవరాలు శ్రేయా భూపాల్ కు రెండు వారాల క్రితం నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఓ వారం పాటు అఖిల్ వీక్ అంటూ.. టాలీవుడ్ కుర్రకారు అంతా కలిసి విపరీతంగా సెలబ్రేట్ చేసేసుకున్నారు. పార్టీలతో హంగామా చేసిపారేశారు.

ఇప్పుడు పార్టీలు పూర్తయిపోయి.. మళ్లీ అసలు వేడుకలోకి వచ్చేసింది వ్యవహారం. అఖిల్ ప్రియురాలి ఇంట పెళ్లి పనులు మొదలైపోయాయి. సాంప్రదాయం ప్రకారం పసుపు కొట్టే కార్యక్రమంతో పెళ్లి పనులను అధికారికంగా ప్రారంభించేశారు. పెళ్లికూతురుతో పాటు ఆమె ఫ్రెండ్స్.. బంధువులు అంతా ఈ ఫోటోలో పసుపు వస్త్రాలు ధరించి చూడముచ్చటగా ఉన్నారు. అఖిల్-శ్రేయాల పెళ్లి పనులు మొదలైన విషయాన్ని ధృవీకరిస్తున్న ఈ పసుపు కొట్టే ఫోటో ఇప్పుడు ఆన్ లైన్ లో ట్రెండింగ్ అయిపోతోంది.

జీవీకే ఇంట పెళ్లిపనులు అధికారికంగా మొదలైపోగా.. మరికొన్ని రోజుల్లో అక్కినేని ఇంటకూడా సందడి మొదలైపోనుంది. మరిన్ని వేడుకలను కూడా త్వరలోనే పూర్తి చేసేయనున్నారట. వచ్చే ఏడాది మే నెలలో అఖిల్-శ్రేయాల పెళ్లి.. టస్కనీలో జరగనున్న సంగతి అక్కినేని ఫ్యాన్స్ కి తెలుసు కదా.

Videos

2,151 thoughts on “అఖిల్ పెళ్లిపనులు మొదలైపోయాయ్