అఖిల్ అంటే..అమ్మో అంటున్నారా?

అక్కినేని అఖిల్ రెండో సినిమా ఎప్పుడు? ఈ ప్రశ్నకు కనీసం గ్యాసిప్ గా నన్నా టాలీవుడ్ లో సమాధానం వినిపించడం లేదు. వారానికో డైరక్టర్ పేరు సీన్ లోకి వస్తోంది కానీ, ఫైనల్ మాత్రం కావడం లేదు.దీనికి కారణం అఖిల్ మైండ్ సెట్ డైరక్టర్ల మైండ్ సెట్ తో మ్యాచ్ కావడం లేదనే వినిపిస్తోంది. నాగ్ రికమెండ్ చేస్తన్న డైరక్టర్లు అందరినీ అఖిల్ వీటో చేస్తున్నారన్న వదంతులు వినిపిస్తున్నాయి.

సోగ్గాడే చిన్ని నాయనా తరువాత కళ్యాణ కృష్ణతో మంచి కథ సెట్ చేసుకోమని నాగ్ ఇద్దరు పిల్లలకు చెప్పినట్లు బోగట్టా. చైతూ ఎస్ అన్నాడు కానీ, అఖిల్ నో అన్నాడని వార్తలు వినవచ్చాయి అప్పట్లో, ఊపిరి విడుదల తరువాత వంశీ పైడిపల్లి లైన్లోకి వచ్చారు. నిజానికి మంచి కాంబినేషన్ అయి వుండేది. అఖిల్ రీమేక్ అని,వంశీ పైడిపల్లి తన కథ అని అనడంతో ఆ కాంబినేషన్ కూడా పక్కకు పోయింది.

ఆ తరువాత హను రాఘవపూడి వచ్చారు. మంచి కథ వుంటే చేద్దాం అని హనుకు ఆవకాశం ఇచ్చారు. కానీ హను చెప్పిన లైన్ లు ఏవీ సెట్ కాలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు హను కూడా అబేయన్స్ లోకి వెళ్లిపోయారు.  మరి ఇక తెరపైకి ఎవరు వస్తారో?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *