నా పాత్ర నిడివి ఎంత ఉన్న పర్వాలేదు: అలియా

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఆలియా అతిథి పాత్రలో నటిస్తుందని కొన్ని రోజులకు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. కరణ్ జోహర్ నన్ను నటిగ పరిచయం చేసిన తర్వాత నా విష్ లిస్ట్ లో ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. వారు సంజయ్ లీల భాన్సాలి, ఎస్,ఎస్,రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నా పాత్ర నిడివి ఎంత ఉన్న పర్వాలేదు. రాజమౌలితో కలసి పనిచేయడమే నాకు మంచి అవకాశం అని అన్నారు. ఈ సినిమా కోసం నేను తెలుగు నేర్చుకుంటున్న అని తెలిపారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్‌టి‌ఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ జోడీగా ఆలియా నటిస్తుంది. ఈ సినిమాను దాదాపు 350 కోట్లతో డి‌వి‌వి దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30నా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Videos