ఆలియా ఫిట్ నెస్… 70 కిలోల డెడ్ లిఫ్ట్స్

ఫిట్‌ నెస్‌ కు విలువిచ్చే సెలబ్రిటీల్లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఒకరు. తన తొలి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’కు చేయకముందు ఆలియా బొద్దు గుమ్మలా ఉండేవారు. సినిమా కోసం దాదాపు 60 కిలోలు తగ్గారు. అప్పటి నుంచి రోజూ జిమ్ బాటపడుతూ టోన్డ్ ఆబ్స్‌ తో చక్కటి శరీరాకృతితో యువతకు స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా ఆలియా జిమ్‌లో ఏకంగా 70 కిలోల డెడ్ లిఫ్ట్స్ ఎత్తుతూ కనిపించారు. ఆలియా లాంటి శరీరాకృతి ఉన్నవారికి అంతటి డెడ్ లిఫ్ట్స్ మోయడం అంటే చాలా కష్టం  కానీ ఆమె తన తదుపరి సినిమాల కోసం జిమ్‌లో కష్టపడుతున్నారు. ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌ నెస్ ట్రైనర్ సోహ్రాబ్ ఖుష్రూషాహి సమక్షంలో ఆలియా కసరత్తులు చేస్తుంటారు. ఆలియాకు ఫిట్‌ నెస్ పై ఉన్న నిబద్ధత పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని సోహ్రాబ్ వెల్లడించారు. ఒకప్పుడు వాటిని ఎట్టడానికి మొహమాట పడ్డ ఆమెలో ఇప్పుడు మార్పు కనపడుతోందని తన ముందు ఎలాంటి టఫ్ టాస్క్ ఇచ్చినా కూడా ఆమె వెనక్కు తగ్గరని వెల్లడిస్తూ ఆలియా డెడ్ లిఫ్ట్ ఎత్తుతున్నప్పుడు తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఆలియా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆలియా తెలుగు చిత్ర పరిశ్రకు పరిచయం కాబోతున్నారు. సినిమాలో ఆలియా.. రామ్ చరణ్‌కు జోడీగా నటించనున్నారు. మరోపక్క తన తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో ఆలియా ‘సడక్ 2’లో నటించనున్నారు. దీంతో పాటు తన మెంటార్ కరణ్ జోహార్ తెరకెక్కించనున్న ‘తఖ్త్’ సినిమా చేయబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించాల్సిన ‘ఇన్‌షా అల్లా’ సినిమా కూడా ఆలియా చేతిలో ఉంది. కానీ ఈ సినిమా చిత్రీకరణ అనుకోకుండా ఆగిపోయింది. ఆలియా తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos