ఉబ్బితబ్బిబ్బవుతున్న అల్లు అర్జున్

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన సరైనోడు, డీజే హిందీ డబ్బింగ్‌ సినిమాలు యూట్యూబ్‌లో మిలియన్లకొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా తన సినిమాలకు వస్తున్న ఆదరణకు ఉబ్బితబ్బిబ్బవుతున్నట్లు అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ట్విటర్‌లో స్పందిస్తూ ‘నా సినిమాలపై మీరు చూపిస్తున్న అభిమానానికి ఫిదా అయ్యాను. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నా సినిమాలు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది’ అని పేర్కొన్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సరైనోడు, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన డీజే హిందీ డబ్బింగ్‌ సినిమాలు యూట్యూబ్‌లో 200,150 మిలియన్లకుపైగా వ్యూస్‌ వచ్చాయి. దీనితో అభిమానులు చూపిస్తున్న అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు అందించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్నరు.

 

 

Videos

One thought on “ఉబ్బితబ్బిబ్బవుతున్న అల్లు అర్జున్

  • November 15, 2019 at 9:23 am
    Permalink

    I like this post, enjoyed this one appreciate it for posting. “The basis of optimism is sheer terror.” by Oscar Wilde.

Leave a Reply

Your email address will not be published.