నా పేరు సూర్య… నా ఇల్లు ఇండియా అల్లు అర్జున్ కొత్త మూవీ ప్రారంభం

ఎప్పటినుండి దర్శకుడు అవ్వాలని అనుకుంటున్న ఈ రైటర్ కల ఎట్టకేలకు నెరవేరింది. ముందులో ఎన్టీఆర్ తనను దర్శకుడిగా పరిచయం చేస్తాడని చాన్నళ్ళు వెయిట్ చేశాడు కాని.. చివరకు వక్కంతం వంశీకి నిరాశ తప్పలేదు. ఇప్పుడు ఫైనల్ గా అల్లు అర్జున్ ను తాను తొలిసారిగా డైరక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాను ఈరోజు లాంచ్ చేశారు.

ఈ చిత్రానికి ‘నా పేరు సూర్య’ అనే టైటిల్ ఖరారు చేశారు. నా ఇల్లు ఇండియా అనేది సబ్ టైటిల్. ఈ మేరకు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ లగడపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘నా పేరు సూర్య’ సినిమా దేశభక్తికి సంబంధించిన కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమా క్యాప్షన్ ‘నా ఇల్లు ఇండియా’ అని పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో అర్జున్ ముఖ్య పాత్రని పోషించనున్నారు. తమిళ నటుడు శరత్ కుమార్ విలన్ గా నటించనుండడం విశేషం. విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. జులై చివరి వారంలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *