ఇక స్క్రిప్ట్‌ లాక్ చేయ్యడమే

టాలీవుడ్ లో స్టార్ హీరో కొనసాగుతున్న అల్లు అర్జున్ స్పీడ్‌ గేర్‌లో దూసుకెళుతున్నారు. ఈయన  ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్‌ దర్శకత్వంలో చేయనున్న సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోతారు. ఈ సినిమా ఫుల్‌ స్క్రిప్ట్‌ను అల్లు అర్జున్‌కు వినిపించేశారంటా సుకుమార్‌. కథ విని, బన్నీ హ్యాపీ అయ్యారని సమాచారం. హీరోకి నచ్చాక ఇక స్క్రిప్ట్‌ లాక్‌ చేసేస్తారు కదా. ఇక మంచి ముహూర్తం చూసుకుని సినిమాని ప్రారంభించడానికి చూస్తున్నారంటా షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ఆరంభించాలనుకుంటున్నారట.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మిస్తారు. ఒకవైపు సుకుమార్‌ సినిమా చేస్తూనే మరోవైపు వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో అంగీకరించిన ‘ఐకాన్‌’ సినిమా షూటింగ్‌లోనూ అల్లు అర్జున్‌ పాల్గొంటారట.

Videos

12 thoughts on “ఇక స్క్రిప్ట్‌ లాక్ చేయ్యడమే

Leave a Reply

Your email address will not be published.