అవును… వాళ్లిద్దరూ విడిపోయారు

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలాపాల్ భర్తతో కటీఫ్ అయిపోయింది. రెండు.. మూడు రోజుల క్రితం వీరిద్దరూ విడిపోతున్నట్లుగా వార్తలు రాగా.. తాజాగా అమలాపాల్ మామ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు. దర్శకుడు విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్.. తమ ప్రేమను సాకారం చేసుకోవటం కోసం పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే.. తన కొడుకు.. అమలాపాల్ విడిపోయినట్లుగా విజయ్ తండ్రి ఏఎల్ అళగప్పన్ స్వయంగా ధ్రువీకరించటంతో ఇప్పటివరకూ గాసిప్ గా ఉన్న అంశం.. ఇప్పుడు నిజమైంది.

ఇక.. విజయ్ కూడా అమలాపాల్ ప్రస్తావన అనవసరమని.. తన తల్లిదండ్రులు ఎలా చెబితే తాను అలా నడుచుకుంటానని చెప్పటం గమనార్హం. వీరిద్దరూ విడిపోవటానికి కారణం ‘వడ చెన్నై’ సినిమాగా చెబుతున్నారు. ఈ సినిమాలో యాక్ట్ చేయటానికి సమంతకు అవకాశం వస్తే.. ఆమె దాన్ని తిరస్కరించటం.. తన బదులు అమలాపాల్ అయితే బాగుంటుందని చెప్పటమేకాదు.. అమలాపాల్ ను ఒప్పించే విషయంలో సమంత పాత్ర ఉందన్న వాదన ఉంది. సినిమాలో యాక్ట్ చేసే విషయంలో దర్శకుడు విజయ్.. అతని కుటుంబీకులకు ఇష్టం లేకపోవటం.. ఈ సందర్భంగా తలెత్తిన మనస్పర్థలు పెరిగి పెద్దవై.. చివరకు వారు విడాకులు తీసకునే వరకూ వెళ్లటం గమనార్హం. రెండేళ్ల వ్యవధిలోనే అమలాపాల్ వైవాహిక జీవితం ముగిసిందని చెప్పొచ్చు.

Videos

25 thoughts on “అవును… వాళ్లిద్దరూ విడిపోయారు

Leave a Reply

Your email address will not be published.