సచివాలయంలోనూ లీకేజీలు!

వెలగపూడిలో నిర్మించిన ఏపీ తాత్కాలిక అసెంబ్లీ భవనం మళ్లీ కారింది. ఇది వరకూ ఒకసారి స్వల్ప వర్షానికే ప్రతిపక్ష నేత జగన్ చాంబర్లోకి నీళ్లు వచ్చాయి. దాదాపు వెయ్యికోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ భవనంలో అలాంటి లీకులు చోటు చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. చంద్రబాబు మానసపుత్రిక, రికార్డు స్థాయి వేగంతో నిర్మించిన భవనం.. అలా కారడంపై విమర్శల వాన కురిసింది.

అయితే అప్పట్లో ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. ఏదో పైపు కట్ అయ్యి నీళ్లు లోపలకు వచ్చాయని.. ఆ పైప్ కట్ కావడంలో కుట్ర ఉందని ప్రభుత్వ పెద్దలు వాదించారు. అదికూడా జగన్ చాంబర్ లోకి నీళ్లు కారాయి కాబట్టి.. అందులో జగన్ కుట్ర ఉందని కూడా తెలుగుదేశం నేతలు అన్నారు. దానిపై విచారణకు ఆదేశిస్తున్నట్టుగా స్పీకర్ కోడెల అప్పట్లో ప్రకటించారు. మరి అప్పట్లో మొదలైన విచారణ ఎటు పోయిందో తెలీదు కానీ.. తాజా వర్షానికి మంత్రుల చాంబర్లలోనే నీళ్లు లీక్ అయ్యాయి. మంత్రులు దేవినేని, గంటా చాంబర్లలోకి నీళ్లు చేరాయి.

నాల్గో బ్లాక్ లోని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ చాంబర్లలో ఏకంగా సీలింగ్ కింద పడిపోయింది. దీంతో వర్షంనీరు ధారాపాతం అయ్యింది. ఇక జలవనరుల శాఖ ఆఫీసుల్లో కూడా వరదజలం చేరింది. ఇక్కడ కూడా పీలింగ్ రూఫ్ ప్లేట్లు ఊడిపోయాయి. దీంతో వర్షం నీరును ఎత్తిపోయించే పని మొదలైంది. అధికారులు అంతా ఈ పనుల్లో ఉన్నారు. మరి లక్ష రూపాయలు పెట్టి రేకుల షెడ్డు కట్టినా నీరు కారవు. కానీ వందల కోట్ల రూపాయల వ్యయంచేసి.. నిర్మించిన అసెంబ్లీ భవనంలో ఇలాంటి నీళ్ల లీకులు జరుగుతుండటం గమనార్హం.

మరి ఫస్ట్ సారి నీళ్లు లీక్ అయ్యాయి అంటే.. అందులో జగన్ కుట్ర ఉందన్నారు. జగన్ చాంబర్ లోకే నీళ్లు ఎలా కారాయి? అని ప్రశ్నించారు. మరి ఇప్పుడు మంత్రుల చాంబర్లలోనికి నీళ్లు రావడంతో ప్రభుత్వం ఏం చెబుతుందో, ఇందులో ఎవరి కుట్ర ఉందని వాదిస్తుందో వెయిట్ అండ్ సీ!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *