డోర్ మ్యాట్స్ పై దేవుళ్ల చిత్రాలు.. చిక్కుల్లో అమెజాన్

ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజ సంస్థ ఆమెజాన్ వివాదంలో చిక్కుకుంది. ఆ సంస్థపై హిందువులలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.  తమ విశ్వాసాలను దెబ్బతీసేలా ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ ప్రవర్తిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువులు పూజించే దేవుళ్ల చిత్రాలను డోర్ మ్యాట్ లపై చిత్రిస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదంపై ఇంటర్ నెట్ లో దుమారం చెలరేగుతోంది. అమెజాన్ వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టిన డోర్ మ్యాట్స్ పై దేవుళ్ల చిత్రాలు ఉన్నట్లు గుర్తించడంతో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

అమెజాన్ ను భారత్ లో బాయ్ కాట్ చేయాలని కొన్ని హిందూ మత సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అమెజాన్ సంస్థ చేస్తున్న వ్యవహారంపై షాక్ తిన్నామని హిందూ మతానికి చెందిన ఓ కమిటీ అధికార ప్రతినిధి రాజన్ నెవడాలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.  అమెజాన్ ప్రెసిడెంట్ పి.బెజోస్ ఈ విషయంపై హిందువులకు క్షమాపణ చెప్పాలని, దేవుళ్ల చిత్ర పటాలున్న మ్యాట్ లను ఆన్ లైన్ నుంచి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.  శివుడు, విష్ణువు, కృష్ణుడు, వినాయకుడు, లక్ష్మీదేవి,  హిందువులు పవిత్రంగా పూజించే దేవుళ్ల చిత్రాలను డోర్ మ్యాట్ లపై చిత్రించి మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని, కించపరుస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హిందువుల దేవుళ్లతో పాటు క్రిస్టియన్ల ఆరాధ్యుడైన జీసస్ పటాలను కూడా డోర్ మ్యాట్ లపై చిత్రించి సెల్స్ చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తుండటం గమనార్హం

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *