అమెజాన్ క్రిస్మస్ బంపర్ ఆఫర్లివే!

మోటోరోలా అభిమానులకు అమెజాన్ బంపర్ ఆఫర్లు తీసుకొచ్చింది. మోటోరోలా మోటో జీ4, మోటో జీ4 ప్లస్, మోటో జీ4 ప్లే ఫోన్లపై భారీ డిస్కౌంట్లను తమ ఫ్లాట్ ఫామ్ పై ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ వెబ్సైట్ ప్రకటించింది. ఈ మోడల్స్‌ను కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్ ధరపై రూ.2000 వరకు డిస్కౌంట్ లభిస్తుందని వెల్లడించింది.
మోటో జీ4 ప్లస్ ఫోన్:
32 జీబీ వేరియంట్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.14,999లు కాగ ఫ్లాట్‌పై రూ.1000 డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ.13,999కే అమెజాన్‌లో లభించనుంది. అదేవిధంగా 16జీబీ వేరయంట్ ఫోన్ కూడా రూ.12,499కే లభించనుందని వెల్లడించింది.
మోటో జీ4 ఫోన్:
మోటో జీ 4వ తరం ఫోన్‌పై రూ.2,000 డిస్కౌంట్‌ను అమెజాన్ అందుబాటులో ఉంచింది. రూ.13,999 ధర కల్గిన 32 జీబీ వేరియంట్ ఈ ఫోన్ రూ.11,999కే లభించనుంది.  అంతేకాక 16జీబీ వేరియంట్ ఫోన్ రూ.10,499కు అందుబాటులో ఉంచనున్నట్టు అమెజాన్ పేర్కొంది.
మోటో జీ 4 ప్లే ఫోన్:
మోటో జీ ప్లే 4వ తరం ఈ ఫోన్‌పై రూ.500 వరకు డిస్కౌంట్‌ను ఈ వెబ్సైట్ ఆఫర్ చేయనుంది. రూ.8,999 ధర కల్గిన ఈ ఫోన్, రూ.8,499కి కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది.
వీటితో పాటు స్టాండర్డ్ చార్టడ్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను, హెచ్డీఎఫ్సీ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ ఆఫర్ చేయనుంది. అదనంగా ఈఎంఐలో మోటో జడ్ ప్లే ఫోన్న కొనుగోలు చేసిన కస్టమర్లకు, అమెజాన్.ఇన్ గిప్ట్ రూపంలో క్యాష్ బ్యాక్‌ను అందించనున్నామని వెల్లడించింది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *