తమిళనాడులో అమ్మ ఫోన్లను చూస్తే దిమ్మ తిరగాల్సిందే.

మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికలలో జయలలిత ఘన విజయం సాదించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించింది. తమిళ జనాల వోట్ల కోసం అధికార పక్షం, విపక్షం రెండు ఎన్నో రకాల హామీలు గుప్పించారు. అందులో జయలలిత ప్రకటించిన హామీలు చూద్దాం. ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్ కి ఉచితంగా ఒక ఆండ్రాయ్డ్ ఫోన్, ఇంటర్‌మీడియేట్ విద్యార్డులకు ఉచితంగా ల్యాప్‌టాప్ మరియు ఉచిత ఇంటర్‌నెట్, 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పెళ్లి చేసుకుంటున్న యువతులకి 8 గ్రాముల ఉచిత బంగారం. ఈ ఉచిత హామీలకు పడిపోయిన తమిళ జనం తమ ఓట్లన్ని అమ్మ పార్టీకి గుద్ది అమ్మని మరోసారి ముఖ్యమంత్రిని చేశారు.

ఇక ముఖ్యమంత్రి అయిన అమ్మ తన హామీలను తీర్చే పనిలో పడ్డారు. అందులో ముఖ్యంగా అమ్మ ఉచిత స్మార్ట్ ఫోన్ పథకం తొందరలొనే మొదలుకానుంది. ఈ పథకం క్రింద ప్రతి ఒక్క రేషన్ కార్డుకు ఒక ఫోన్ ని అందజేస్తారు. ఉచిత ఫోన్ అనగానే అదేదో ఉత్తుత్తి ఫోన్ అనుకునేరు, కాదు ఆ ఉచిత ఫోన్ ఫీచర్లు మార్కెట్ లో దొరుకుతున్న ఫోన్లకు ఏ మాత్రం తగ్గవు. లేటెస్ట్ ఆండ్రాయ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, మంచి ప్రోసెసర్, ర్యామ్, ఫ్రంట్ మరియు బ్యాక్ కామేర ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి. ఆ లిస్ట్ మీకోసం.

OS – Android v6.0 (Marshmallow).
CPU – Quad-core 1.2 GHz.
RAM – 1 GB RAM.
Battery – 2000 mAh.
Camera – 5 MP with flash
SIM – 3G Dual Sim.
Internal Memory – 8 GB.
SD Card slot – up to 32 GB.
Size – 5.0 inches.
Weight – 153.1g.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *